అపూర్వ కలయిక
గీత గోవిందం’ చిత్రంతో అగ్ర హీరో విజయ్ దేవరకొండకు బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించారు దర్శకుడు పరశురామ్. వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రానికి రంగం సిద్ధమైంది.
‘గీత గోవిందం’ చిత్రంతో అగ్ర హీరో విజయ్ దేవరకొండకు బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించారు దర్శకుడు పరశురామ్. వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రానికి రంగం సిద్ధమైంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాతలు దిల్‌రాజు-శిరీష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. దిల్‌రాజు బ్యానర్లో విజయ్ దేవరకొండ నటిస్తున్న తొలి చిత్రమిదే కావడం విశేషం. భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా తమ సోషల్‌మీడియా ఖాతాల్లో దిల్‌రాజు, విజయ్ దేవరకొండ, పరశురామ్ భేటీ అయిన ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ సినిమా కోసం దర్శకుడు పరశురామ్ వినూత్న కథను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

