Kushi | విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివనిర్వాణ దర్శకుడు. నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. ‘నాతో రా, నీలా రా,ఆరాధ్య’ అంటూ సాగే ఈ పాటను శివ నిర్వాణ రచించగా, తమిళంలో మదన్ కార్కీ సాహిత్యాన్ని అందించాడు. తెలుగు, తమిళంలో సిద్‌శ్రీరామ్, చిన్మయ ఆలపించారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘విజయ్, సమంత కలయికలో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. కుటుంబ భావోద్వేగాలకు, వినోదాన్ని మేళవించి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం హృదయానికి హత్తుకునే విధంగా వుంటుంది’ అన్నారు. సెప్టెంబర్ 1న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం’ అన్నారు. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి.