Vijay Devarakonda | ‘ఖలేజా’ సినిమా నచ్చలేదంటే గొడవ పడేవాడిని : విజయ్ దేవరకొండ
Dulquer Salmaan | మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం లక్కీ భాస్కర్ (Lucky Bhaskar). గత ఏడాది ‘సార్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్గా నటిస్తుంది.
Dulquer Salmaan | మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం లక్కీ భాస్కర్ (Lucky Bhaskar). గత ఏడాది ‘సార్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్‌తో పాటు పాటలు విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు మేకర్స్. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథులుగా రౌడి హీరో విజయ్ దేవరకొండతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి సందడి చేశారు.
అయితే ఈ వేడుకలో విజయ్ మాట్లాడుతూ.. తనకు సితార ఎంటర్టైనమెంట్స్తో మంచి అనుభందం ఉందని విజయ్ తెలిపాడు. పెళ్లి చూపులు మూవీ విజయం సాధించిన తర్వాత నా ఫస్ట్ చెక్ సితార ఎంటర్టైనమెంట్స్ నుంచి అందుకున్నాను. త్రివిక్రమ్ గారు నన్ను ఆఫీస్‌లో కుర్చోబెట్టి నా ఫస్ట్ చెక్ ఇప్పించారు. ఇది జరిగి 7 ఏండ్లు అవుతుంది. సితార అప్పుడు చెక్ ఇస్తే.. ఇన్ని సంవత్సరాలు పట్టింది సినిమా చేయడానికి. ఇప్పుడు మేం కలిసి వీడీ12 చేస్తున్నాం. త్రివిక్రమ్ సర్ని ఫస్ట్ టైం కలవడం నా లైఫ్‌లో మర్చిపోలేని క్షణం. నా పర్సనల్ ఫేవరెట్ చిత్రాలు అతడు, ఖలేజా. ఖలేజా సినిమా అయితే ఎవడైనా నచ్చలేదు అంటే నేను వాడితో గొడవ పడే వాడిని అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. అలాంటి మనిషి నాకు చెక్ ఇచ్చి నువ్వు స్టార్ అవుతావు అంటూ చెప్పాడు. ఎవరు సినిమాలు చూస్తూ పెరిగామో ఆ వ్యక్తి మనల్ని స్టార్ట్ అవుతారు అని చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది అంటూ విజయ్ చెప్పుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

