Vijay devarakonda-Puri Jagannadh Project | డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కిన ‘లైగర్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే వీళ్ళ కాంబోలో మరో ప్రాజెక్టు తెరకెక్కనున్నట్లు ఇదివరకే ప్రకటన వచ్చింది. అది పూరీ డ్రిమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ అని గతంనుంచే ప్రచారం సాగుతుంది. అయితే తాజాగా వీళ్ళిద్దరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన బిగ్ అప్డేట్ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఈ ప్రాజెక్ట్ సంబంధించిన పూజా కార్యక్రమాలను 2.20 గంటలకు ముంభైలో లాంఛనంగా ప్రారంభంకానున్నట్లు పూరీ డిఫరెంట్ స్టైల్లో పోస్టర్‌ను విడుదల చేశాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను కూడా పూరీ, బాలీవుడ్ ప్రోడ్యూసర్తో కలిసి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న లైగర్ చిత్రంలో అనన్యపాండే హీరోయిన్గా నటిస్తుంది. ముంబైలోని ఓ ఛాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదిగాడు అనే నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేయనున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు.
— Vijay Deverakonda (@TheDeverakonda) March 28, 2022