Vijay Devarakonda | విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమాపై బిగ్ అప్డేట్?
Vijay Devarakonda | రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి రెండేళ్ళు దాటింది. 2020లో భారి అంచనాలతో విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ విజయ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఫలితంతో విజయ్ తన తదుపరి సినిమాపై పూర్తి దృష్టని పెట్టాడు. ఈ క్రమంలోనే రెండేళ్ళు ‘లైగర్’ కోసం కష్టపడ్డాడు. గత చిత్రాలకు భిన్నంగా విజయ్ పూర్తి మేకోవర్‌తో ఈ చిత్రంలో కనిపించనున్నాడు. మాములుగా పూరి సినిమాలలో హీరోలకు సెల్ఫ్ రెస్పెక్ట్, యాటిట్యూడ్, తెగింపు ఉంటాయి. ఇక ఇవన్ని లక్షణాలు ముందుగానే ఉన్న రౌడీ బాయ్‌ను పూరి ఏ విధంగా చూపిస్తాడో అని ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. దానికి తోడు చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ గ్లింప్స్ అంచనాలను అమాంతం పెంచాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది.
అయితే ఇదే కాంబోలో ‘జనగనమణ’ తెరకెక్కనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ జూన్ మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో విజయ్ ఆర్మీ అధికారిగా కనిపించనున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించనుంది. ఇది వరకే మేకర్స్ విడుదల చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్లపై పూరి, చార్మీ లతో కలిసి వంశీ పైడిపల్లి నిర్మిస్తున్నాడు.
ప్రస్తుతం విజయ్, శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ చిత్రాన్ని చేస్తున్నాడు. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చితం ఇటీవలే కాశ్మీర్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే హైదరాబాద్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ రెండు సినిమా షూటింగ్లలో విజయ్ దేవరకొండ ఏకకాలంలో పాల్గొననున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

