టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (vijay devarakonda) చేస్తున్న చిత్రాల్లో ఒకటి ఖుషి. VD11వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. శివనిర్వాణ (Shiva Nirvana) డైరెక్షన్లో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ఈ సినిమా షూటింగ్ కోసం విజయ్ యాక్షన్ ప్లాన్ రెడీ చేశాడట. తాజా న్యూస్ ప్రకారం నవంబర్ కల్లా ఈ సినిమాను పూర్తి చేయాలని విజయ్ ఫిక్స్ అయినట్టు టాక్. అంతేకాదు దీనికనుగుణంగా డేట్స్ కూడా ఇచ్చేశాడని ఓ అప్డేట్ ఇపుడు ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. విజయ్ నటించిన లైగర్ షూటింగ్ పూర్తి చేసుకుని..ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక పూరీ జగన్నాథ్‌తో చేయబోతున్న రెండో ప్రాజెక్టు జనగణమన (జేజీఎం) ఈ ఏడాది చివరలో షురూ చేయనున్నాడు. కోవిడ్ థర్డ్ వేవ్ తర్వాత నాన్ స్టాప్‌గా వర్క్ చేస్తానని చెప్పిన విజయ్ దేవర కొండ..అందుకు తగ్గట్టుగానే షూటింగ్ షెడ్యూల్స్ ఫిక్స్ చేసుకున్నట్టు తాజా అప్డేట్ చెబుతోంది.
ఖుషి చిత్రంలో జయరాం, సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.