Spirit |సందీప్ రెడ్డి వంగా పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ బ్రాండ్‌గా మారిన సంగతి తెలిసిందే. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చింది. ఆ సినిమాతోనే సందీప్ రెడ్డి వంగా తన ప్రత్యేక దర్శకశైలిని చాటుతూ, కథానాయకుల పాత్రల రూపకల్పనలో కొత్తదనం చూపించారు. తర్వాత బాలీవుడ్లో ‘కబీర్ సింగ్’ రీమేక్‌లో సక్సెస్ సాధించి, రణబీర్ కపూర్‌తో ‘యానిమల్’ ద్వారా స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడు. ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌తో తెరంగేట్రం చేయబోతున్నాడు. ప్రభాస్ ప్రధాన పాత్రలో ‘స్పిరిట్’ సినిమాను రూపొందిస్తున్న సందీప్ రెడ్డి వంగా, ఈ మూవీ ద్వారా హీరోకు పూర్తిగా కొత్త షేడ్ క్యారెక్టర్, డార్క్ టోన్ ఎమోషనల్ డ్రామా, ఇంటెన్స్ యాక్షన్ కలబోస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిప్తి దిమ్రి కథానాయికగా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్, డాన్ లీ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.సినిమా విడుదలకు దాదాపు 14 నెలలే మిగిలినప్పటికీ, సోషల్ మీడియాలో ఇప్పటికే కొన్ని రూమర్స్ నెట్టిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ క్యామియోలో కనిపిస్తాడనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇటీవల విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డికలవడం, అలాగే అర్జున్ రెడ్డి షూటింగ్ సమయంలో తీసుకున్న ఫోటోను సందీప్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగే, ప్రభాస్ తండ్రి పాత్రలో చిరంజీవి నటించనున్నారనే వార్తను కూడా దర్శకుడు ఇప్పటికే ఖండించారు.
ఇప్పటికే విడుదలైన ఆడియో టీజర్‌కి ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ‘స్పిరిట్’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. మేకర్స్ ఇప్పటికే సినిమాను 2027, మార్చి 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.