Family Star | రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). గీతగోవిందం సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పరశురాం (Parasuram) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తుండగా.. ఎస్వీసీ బ్యానర్లో వస్తున్న 54వ చిత్రమిది. ఈ సినిమా ఏప్రిల్ 05న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ షూరు చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ అప్డేట్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. త్వరలోనే టీజర్ రానుంది అంటూ ఎక్స్‌లో రాసుకోచ్చాడు. ఇక ఈ సినిమాలో కుటుంబ బాగోగులు చూసుకునే ఫ్యామిలీ మ్యాన్‌గా, బయట రౌడీల బెండు తీసే పవర్ఫుల్ మ్యాన్‌గా విజయ్ దేవకొండ ఇందులో కనిపించనున్నారు. కూల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్, సంగీతం: గోపీ సుందర్.
Teaser వస్తుంది / வந்திட்டுருக்கு 🙂
— Vijay Deverakonda (@TheDeverakonda) March 1, 2024
విజయ్ దేవరకొండ మరోవైపు జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో VD12లో కూడా నటించనున్నాడు పోలీస్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.