Liger Aafat Promo | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘లైగర్’ ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఒక్క ట్రైలర్‌తోనే లైగర్ సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ఈక్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లో ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ మరో అప్డేట్ను ప్రకటించారు.
ఈ చిత్రంలోని ‘ఆఫాట్’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా విడుదలైన ఈ ప్రోమోకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ పాట ఫుల్ లిరికల్ వీడియో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విడుదల కానుంది. ఇక ఇటీవలే విడుదలైన లైగర్ యాటిట్యూడ్ సాంగ్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ముంబైలోని ఓ చాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. విజయ్‌కు జోడీగా అనన్యపాండే హీరోయిన్గా నటించింది. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు. కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
#Aafat promo #FirstOnTwitter @TheDeverakonda @ananyapandayy 💞
Song Tomorrow at 4 PM!#Liger #LigerOnAug25th pic.twitter.com/SAieAosyuQ
— Charmme Kaur (@Charmmeofficial) August 4, 2022