Vijay Devarakonda | మరి కొన్ని గంటల్లో ‘లైగర్’ ఫస్ట్ సింగిల్ ప్రోమో
Liger First Single Promo | విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘లైగర్’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ క్రమంలో లైగర్ టీం అప్డేట్లను స్టార్ట్ చేసింది. తాజాగా మేకర్స్ ‘అక్డీ పక్డీ’ సాంగ్ ప్రోమో అప్డేట్ను ప్రకటించారు.
అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న లైగర్ పాటల అప్డేట్లు షూరు అయ్యాయి. లైగర్ ఫస్ట్ సింగిల్ అక్డీ పక్డీ లిరికల్ సాంగ్ జూలై 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ పాట ప్రోమోను శుక్రవారం 4గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇటీవలే చిత్రం నుండి విడులైన విజయ్ పోస్టర్ క్షణాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ముంబైలోని ఓ ఛాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సార్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా అనన్యపాండే హీరోయిన్గా నటించింది. కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరీ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రం తెలుగు తోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
#AkdiPakdi
Song Promo Today @ 4 PM 🕓 #Liger— Puri Connects (@PuriConnects) July 8, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

