Vijay Devarakonda | హిట్టు కోసం ఐదేళ్లుగా ఎదురుచూశా.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్టు
Kushi Movie| టాలీవుడ్ సినీ జనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సినిమాల్లో ఖుషి (Kushi) ఒకటి. విజయ్ దేవరకొండ (Vijay deverakonda), సమంత (Samantha) కాంబినేషన్లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాను నిన్ను కోరి, మజిలీ ఫేం శివనిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Kushi Movie| టాలీవుడ్ సినీ జనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సినిమాల్లో ఖుషి (Kushi) ఒకటి. విజయ్ దేవరకొండ (Vijay deverakonda), సమంత (Samantha) కాంబినేషన్లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాను నిన్ను కోరి, మజిలీ ఫేం శివనిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఖుషి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, ప్రేక్షకులను ఎంగేజింగ్ చేయడంలో శివనిర్వాణ కథ, కథనం కీలక పాత్ర పోషించాయని సోషల్ మీడియాలో నెటిజెన్లు అంటున్నారు. గీత గోవిందం తర్వాత మళ్లీ అలాంటి సూపర్ హిట్ సినిమా ఇదేనని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి వస్తున్న స్పందన పట్ల విజయ్ దేవరకొండ (VD) సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్టు చేశాడు.
”మీరందరూ నాతో పాటు 5 సంవత్సరాలుగా హిట్టు కోసం వెయిట్ చేశారు. నా పని నేను చేస్తానని ఓపికగా ఎదురు చూస్తున్నాను. మొత్తానికి ఈ రోజు హిట్టు కొట్టేశాం.. వందల కొద్ది ఫోన్లు, మెసెజ్‌లతో నిద్రలేచా.. ఈ క్షణంలో నేను కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేను. నేను మీ అందరి పట్ల ప్రేమతో ఉన్నాను. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఖుషి (Kushi)కి వెళ్లి ఆనందించండి. ప్రేమతో మీ విజయ్ దేవరకొండ” అంటూ ట్వీట్లో రాసుకోచ్చాడు.
మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్ తెరకెక్కించిన ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రంలో సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కన్నడ యాక్టర్ జయరాం, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

