Kushi Movie | విజయ్‌దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన ‘నా రోజా నువ్వే’ ‘ఆరాధ్య’ పాటలకు సోషల్‌మీడియాలో మంచి స్పందన లభిస్తున్నది. ‘ఖుషి..’ అంటూ సాగే మూడో పాటను ఈ నెల 28న విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఈ సినిమా పాటలు సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మూడో గీతం కూడా శ్రోతలను అలరిస్తుంది. హృద్యమైన ప్రేమకథగా అందరిని ఆకట్టుకునే సినిమా ఇది’ అని చిత్రబృందం పేర్కొంది. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జి ము రళి, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, రచన-దర్శకత్వం: శివ నిర్వాణ.