Vijay | దళపతి బర్త్ డే సందర్భంగా సర్ప్రైజ్ వీడియో..ఫస్ట్ రోర్ అదిరింది..!
Vijay | దళపతి విజయ్‌కి తమిళనాట ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజనీకాంత్ తర్వాత అంత మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్. అయితే ఇప్పుడు రాజకీయాలలోకి విజయ్ వస్తున్న నేపథ్యంలో ఆయన చివరిగా `జన నాయగన్`(జన నాయకుడు) అనే చిత్రం చేస్తున్నాడు.
Vijay | దళపతి విజయ్‌కి తమిళనాట ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజనీకాంత్ తర్వాత అంత మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్. అయితే ఇప్పుడు రాజకీయాలలోకి విజయ్ వస్తున్న నేపథ్యంలో ఆయన చివరిగా `జన నాయగన్`(జన నాయకుడు) అనే చిత్రం చేస్తున్నాడు. హెచ్ వినోద్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో పూజా హెగ్డే, మమితా బైజు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్ కే నిర్మిస్తున్నారు. శరవేగంగా మూవీ చిత్రీకరణ జరుగుతుంది.
దర్శకుడు వినోద్ ఈ చిత్రాన్ని చాలా కేర్‌ఫుల్‌గా తెరకెక్కిస్తున్నారు. విజయ్ చివరి చిత్రం కావడంతో చాలా కేర్ తీసుకుని, బలమైన కంటెంట్‌తో `జన నాయగన్` చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఆదివారం విజయ్ జన్మదినం సందర్భంగా మూవీ నుంచి రోరింగ్ లుక్ పోస్టర్, వీడియో విడుదల చేశారు. ఈ వీడియో తమిళనాట విజయ్ అభిమానుల్లో పండుగ వాతావరణం తీసుకొచ్చింది అని చెప్పాలి. విజయ్ పోలీస్ లుక్‌లో పవర్‌ఫుల్‌గా కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. ఇక మూవీకి అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు.
జన నాయగణ్ మొదటి నుంచి ఈ చిత్రం తెలుగులో బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రానికి రీమేక్ అని ప్రచారం జరుగుతుండగా, అలాంటిదేమీ లేదని మేకర్స్ చెబుతూ వచ్చారు. పూర్తిగా కొత్త కథతోనే ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా మూవీని విడుదల చేయనున్నారు. 09-01-2026న చిత్రం విడుదల కానుంది అంటూ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇక విజయ్ ఎట్టకేలకి యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు. నేటితో ఆయన 51వ పడిలోకి అడుగుపెట్టారు.. దీంతో ఈ బర్త్ డే ఆయనకు చాలా స్పెషల్‌గా ఉంటుంది. పైగా రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉన్న నేపథ్యంలో ఆయనకు ఈ పుట్టిన రోజు చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- anirudh
- H Vinoth.
- Jana Nayagan
- KVN
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

