Beast OTT | ఓటీటీలోకి విజయ్ ‘బీస్ట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Beast OTT Release Date | కోలీవుడ్ స్టార్ విజయ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘బీస్ట్’. నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 13న విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ‘డాక్టర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నెల్సన్ కుమార్ ఈ చిత్రం తెరకెక్కించడంతో ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు విజయ్ అభిమానులను సైతం తీవ్రంగా నిరాశపరిచింది. కథ బాగానే ఉన్న కథనం స్లోగా ఉందని, కామెడీ అన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.
పైగా ఈ చిత్రం విడుదలైన మరుసటి రోజే ‘కేజీఎఫ్-2’ విడుదలవడం బీస్ట్‌కు గట్టి పోటీనిచ్చింది. ‘మాస్టర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ నుంచి ఈ చిత్రం రావడంతో తెలుగులో 10కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఫైనల్‌గా ఈ చిత్రం రూ.6.32 కోట్ల వరకు కలెక్షన్లను సాధించి డిస్ట్రిబ్యూటర్లకు రూ.3.68 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చింది. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థలైన ‘సన్ ఎన్ఎక్స్టి’, ‘నెట్‌ఫ్లిక్స్’లలో ఈ చిత్రం మే 11 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించాడు.
ఈ మధ్య హిట్టయిన సినిమాలే రెండు నెలల్లోపే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. అలాంటిది ఫ్లాప్ అయిన సినిమాలు కేవలం మూడు నుంచి నాలుగు వారాలకే ఓటీటీ బాట పడుతున్నాయి. ‘బీస్ట్’ చిత్రం కూడా విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీ విడులకు సిద్ధమైంది. ఇటీవలే విడుదలైన ‘రాధేశ్యామ్’ చిత్రం కూడా మూడు వారాల్లోనే ఓటీటీలో సందడి చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

