కండిషన్స్ తెచ్చిన తంట
వెరైటీ సినిమాల కేరాఫ్ అడ్రస్ విజయ్ ఆంటోనీ నటిస్తున్న సినిమా ‘లవ్ గురు’. మృణాళిని రవి కథానాయిక. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్న ఈ చిత్రం మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న విడుదల కానుంది.
వెరైటీ సినిమాల కేరాఫ్ అడ్రస్ విజయ్ ఆంటోనీ నటిస్తున్న సినిమా ‘లవ్ గురు’. మృణాళిని రవి కథానాయిక. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్న ఈ చిత్రం మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. తండ్రి పోరు పడలేక పెళ్లికి ఒప్పుకున్న ప్రియ.. పెళ్లి చూపుల టైమ్‌లో తనను చూడ్డానికి వచ్చిన కుర్రాడికి కొన్ని కండిషన్స్ పెడుతుంది. అమ్మాయి నచ్చడంతో ఆ కండిషన్స్ అన్నింటికీ ఆ కుర్రాడు తలూపాడు. పెళ్లయ్యాక ఆ కండీషన్స్ వల్ల కలిగే ఇబ్బందులు అర్థమయ్యాయి. ఆ ఇబ్బందుల నుంచి హీరో ఎలా బయటపడ్డాడు?.. ఈ అంశాలన్నీ ట్రైలర్లో కనిపిస్తున్నాయి. యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా నచ్చేలా సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. వీటీవీ గణేశ్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఫరూక్ జె.భాష, సంగీతం: భరత్ ధనశేఖర్, సమర్పణ: మీరా విజయ్ ఆంటోనీ, నిర్మాత, ఎడిటింగ్, విజయ్ ఆంటోనీ, నిర్మాణం: విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

