విజయ్ ఆంటోని హీరోగా శశి దర్శకత్వంలో వచ్చిన ‘బిచ్చగాడు’ సినిమా ఎంతటి సక్సెస్‌ని సాధించిందో తెలిసిందే. మళ్లీ ఆ కాంబినేషన్‌ని రిపీట్ చేస్తూ రూపొందుతున్న చిత్రం ‘వంద దేవుళ్లు’. రామాంజనేయులు జవ్వాజి నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని పాటను ఆదివారం మేకర్స్ విడుదల చేశారు.
‘రీంగారా రీంగారా..’ అంటూ సాగే ఈ రొమాంటిక్ మెలొడీని భాష్యశ్రీ రాయగా, బాలాజీ శ్రీరామ్ స్వరపరిచారు. సంతోష్ హరిహరన్, మానసి జి.కణ్ణన్ ఆలపించారు. యువజంట లిజమోల్ జోస్, అజయ్ దీషాన్లపై చిత్రీకరించిన ఈ పాట యువతను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి మాటలు: భాష్యశ్రీ, కెమెరా: ఎస్బీ దర్శన్ కిర్లోష్, సమర్పణ: ఫాతిమా విజయ్ ఆంటోని, నిర్మాణం: విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, సర్వంత్రామ్ క్రియేషన్స్.