Vijay Antony | విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తుఫాన్’. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘పొయిటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.
తనను చిన్నచూపు చూసే సమాజాన్ని సంస్కరించి వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే వ్యక్తి కథ ఇది. ఓ దివి నేపథ్యంలో కథ సాగుతుంది. అండమాన్ మరియు డయ్యూడామన్లలో చిత్రీకరణ జరిపాం. ప్రస్తుతం షూటింగ్ తుదిదశలో ఉంది. ఈ నెల 29న టీజర్‌ను విడుదల చేయబోతున్నాం’ అని తెలిపారు. శరత్‌కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి, విజయ్ ఆంటోని, సంభాషణలు: భాష్యశ్రీ, రచన-సినిమాటోగ్రఫీ-దర్శకత్వం: విజయ్ మిల్టన్.