Vijay Antony | ప్రమాదం తర్వాత తొలిసారి స్పందించిన విజయ్ ఆంటోనీ.. మేజర్ సర్జరీ పూర్తైందంటూ పోస్ట్..!
పిచ్చైకారన్ చిత్రీకరిస్తున్న సమయంలో విజయ్ ఆంటోనీకి గాయాలైన విషయం తెలిసిందే. ప్రమాదం తర్వాత విజయ్ తొలిసారి స్పందించారు.
Vijay Antony | బిచ్చగాడు సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విజయ్ ఆంటోనీ (Vijay Antony). ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం పిచ్చైకారన్ (బిచ్చగాడు-2) చేస్తున్నాడు. అయితే ఇటీవలే మలేషియా సమీపంలోని లంగ్కావి దీవి (langkawi)లో షూటింగ్లో భాగంగా జెట్ స్కై విమానంలో వెళ్లే సీన్లు చిత్రీకరిస్తున్న సమయంలో విజయ్ ఆంటోనీకి గాయాలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయ్ ఆంటోనీ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, కోమాలో ఉన్నాడంటూ పలు వైబ్సైట్లలో సైతం వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదం తర్వాత విజయ్ తొలిసారి స్పందించారు.
ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయ్.. ట్విట్టర్ వేదికగా తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేశారు. ‘డియర్ ఫ్రెండ్స్.. మలేషియాలో పిచ్చైకారన్(బిచ్చగాడు 2) షూటింగ్ సమయంలో నేను ప్రమాదానికి గురయ్యా. నా దవడ, ముక్కు భాగాలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం కోలుకుంటున్నాను. ఇప్పుడే మేజర్ సర్జరీ పూర్తి అయ్యింది. వీలైనంత త్వరలో మీతో మాట్లాడతాను. ఈ కఠిన పరిస్థితుల్లో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు ’ అంటూ పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన ఆయన అభిమానులు విజయ్ ఆంటోనీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
Dear friends, I am safely recovered from a severe jaw and nose injury during Pichaikkaran 2 shoot in Malaysia.
I just completed a major surgery.
I will talk to you all as soon as possible😊✋
Thank you for all your support and concern for my health🙏❤️ pic.twitter.com/YJm24omxrS— vijayantony (@vijayantony) January 24, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

