Maargan Trailer | ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో వస్తున్న విజయ్ ఆంటోనీ.. ఉత్కంఠగా ‘మార్గన్’ ట్రైలర్
Maargan Trailer | తమిళ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం మార్గన్ (Maargan). ఈ సినిమాకు లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తుండగా.. విజయ్ ఆంటోనీ ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోనీ నిర్మిస్తుంది.
Maargan Trailer | తమిళ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం మార్గన్ (Maargan). ఈ సినిమాకు లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తుండగా.. విజయ్ ఆంటోనీ ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోనీ నిర్మిస్తుంది. ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందినట్లు తెలుస్తోంది. ఒక సైకో స్విమ్మర్ అమ్మాయిలకు ఒక వింత డ్రగ్‌ను ఇచ్చి హత్య చేస్తుంటాడు. ఈ డ్రగ్ ప్రభావం వల్ల వారి శరీరాలు నల్లగా మారి ప్రాణాలు కోల్పోతాయి. అయితే ఈ కేసును దర్యాప్తు చేసే పోలీస్ అధికారి పాత్రలో విజయ్ ఆంటోనీ కనిపించనున్నారు. దర్యాప్తులో భాగంగా అతను కూడా ఈ డ్రగ్ బారిన పడి, అతని శరీరంలో సగం నల్లగా మారడం ట్రైలర్లో హైలైట్‌గా నిలిచింది. ఈ హత్యల వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి, హంతకుడిని విజయ్ ఆంటోనీ ఎలా పట్టుకుంటాడనేది సినిమా ప్రధాన కథాంశం. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దిశాన్ విలన్‌గా నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

