Hatya Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న విజయ్ ఆంటోని ‘హత్య’ ట్రైలర్
Vijay Antony Hatya Movie Trailer | ‘బిచ్చగాడు’ సినిమాతో టాలీవుడ్లో మంచి మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు విజయ్ ఆంటోని. తెలుగులో పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన విజయ్ ఆంటోని.. ‘సలీమ్’ సినిమాతో హీరోగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. 2016లో వచ్చిన ‘బిచ్చగాడు’తో ఇక్కడి వారికి మరింత దగ్గరయ్యాడు. ఈ చిత్రం తర్వాత విజయ్ నటించిన ప్రతి సినిమా ఇక్కడ కూడా విడుదలైంది. అయితే బిచ్చగాడు తర్వాత ఇప్పటివరకు ఆ స్థాయిలో ఈయనకు మరో హిట్టు పడలేదు. ప్రస్తుతం ఈయన చేతిలో ఏడు సినిమాలున్నాయి. అందులో ‘దోషి’ ఒకటి. సీ.ఎస్ ఆముదన్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. తాజాగా నాచ్యురల్ స్టార్ నాని ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశాడు.
‘పర్ఫెక్ట్ మర్డర్ అంటూ ఏది ఉండదు. అన్ని మర్డర్స్‌లో ఒక లోపం ఉంటుంది’ అంటూ హీరో వాయిస్‌తో ట్రైయిలర్ మొదలైంది. ‘ఇండియన్ సెలబ్రెటీ మోడల్ లైలా అనే ఒక యువతి ఓ తాళం వేసిన ఇంట్లో అనుమాస్పద రీతిలో హత్యకి గురయ్యారు’ అంటూ వచ్చే డైలాగ్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతుంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని డిటెక్టీవ్‌గా నటించాడు. ట్రైలర్‌ను గమనిస్తే సినిమా గ్రాండియర్‌గా రూపొందినట్లు తెలుస్తుంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్ ఫీల్‌ను కలిగిస్తున్నాయి. ట్రైలర్ చివర్లో ‘నేను పుట్టాను, బతికాను. కానీ ఏదో సాధించాలనుకునేలోపే నన్ను చంపేశారు. ఎవరు చంపారో, ఎందుకు చంపారో, ఎలా చంపారో మీకు తెలియాలంటే నేనెవరో ముందు మీరు తెలుసుకోవాలి’ అంటూ వచ్చిన డైలాగ్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది.
ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా నందితా శ్వేత, నంబెస్సాన్ రమ్య, మహిమా నంబియార్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇన్ఫినిటి ఫిలింస్ వెంచర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లీలా పాత్రలో ఖిలాడీ బ్యూటీ మీనాక్షీ చౌదరి నటించింది. క్రైమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. గ్రిష్ గోపాలక్రిష్ణన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

