Hatya Movie Fisrt Single | ‘బిచ్చగాడు’ సినిమాతో టాలీవుడ్లో మంచి మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు విజయ్ ఆంటోని. తెలుగులో పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన విజయ్ ఆంటోని.. ‘సలీమ్’ సినిమాతో హీరోగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. 2016లో వచ్చిన ‘బిచ్చగాడు’తో ఇక్కడి వారికి మరింత దగ్గరయ్యాడు. ఈ చిత్రం తర్వాత విజయ్ నటించిన ప్రతి సినిమా ఇక్కడ కూడా విడుదలైంది. అయితే బిచ్చగాడు తర్వాత ఇప్పటివరకు ఆ స్థాయిలో ఈయనకు మరో హిట్టు పడలేదు. ప్రస్తుతం ఈయన చేతిలో ఏడు సినిమాలున్నాయి. అందులో ‘దోషి’ ఒకటి. సీ.ఎస్ ఆముదన్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన ఆసక్తిని క్రియేట్ చేశాయి. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ అప్డేట్లను స్టార్ట్ చేశారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమాలోని ‘ఈ బ్రతుకే నీటి బుడగే’ అంటూ సాగే పాటను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. భాష్యశ్రీ సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు. గిరీష్ గోపాలకృష్ణన్ స్వర పరిచిన ఈ పాట మంచి ఫీల్‌ను కలిగిస్తుంది. ఇన్ఫినిటి ఫిలింస్ వెంచర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా రితికా సింగ్ కథానాయిగా నటించింది. మీనాక్షీ చౌదరీ కీలకపాత్రలో నటించింది. క్రైమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.