Bichagadu-2 Sneak Peek | కొన్ని సినిమాలు సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో ‘బిచ్చగాడు’ ఒకటి. ఎలాంటి ప్రమోషన్లు లేకుండా రిలీజైన ఈ సినిమా టాలీవుడ్లో తిరుగులేని విజయాన్ని సాధించింది. అప్పట్లో ఈ సినిమాకు పోస్టర్లు కూడా ఎక్కువగా అతికించలేదు. కేవలం గోడలపై బిచ్చగాడు సినిమా విడుదల అంటూ రాసారు. అలా లో ప్రమోషన్లతో ఈ సినిమా విడుదలైంది. తొలిరెండు రోజులు థియేటర్లలో జనాలే లేరు. కానీ ఆ తర్వాత మౌత్ టాక్‌తో జనాలు థియేటర్లకు రావడం మొదలుపెట్టారు. రూ.2.2 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా తెలుగులో రూ. 14కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఘన విజయం సాధించింది.
ఇక ఇప్పుడు పార్ట్-2 వచ్చేస్తుంది. విజయ్ ఆంటోని నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే రిలీజైన టైటిల్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. కాగా తాజాగా చిత్రబృందం ఈ సినిమా నుండి స్నీక్ పీక్ అంటూ ఓ నాలుగు నిమిషాలు ఉన్న వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోతో మేకర్స్ సినిమాపై కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ మూవీ రానున్నట్లు వీడియోతో స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ సర్జరీ వల్ల మనుషుల లైఫ్ టైమ్ పెంచొచ్చు అనే విషయం క్లియర్‌గా తెలుస్తుంది. అయితే ఈ సర్జరీ వల్ల మంచి వాళ్లు చనిపోకుంటే ఓకే, కానీ హిట్లర్ లాంటి ఉన్మాదులు ఈ సర్జరీని మిస్యూస్ చేసుకోవడానికి చనిపోకుండా ఉండి పోతే ప్రపంచానికి ఎంత ప్రమాదం అనే డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తి రెకెత్తిస్తుంది.
ఈ ఒక్క వీడియోతో సినిమాపై ఎక్కడ లేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను మరింత గ్రాండ్‌గా రూపొందించినట్లు వీడియో చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాకు నిర్మాత, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనియే కావడం విశేషం. కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ కానుంది.
కాగా గతేడాది మలేషియాలో ఈ సినిమా షూటింగ్ చేస్తుండగా విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడ్డారు. ఓ బోట్ సీన్ షూట్ చేస్తుండగా విజయ్ ఆంటోనీకి ప్రమాదం జరిగింది. ముఖానికి దెబ్బలు తగలడంతో పళ్లు, దవడ ఎముకలు విరిగిపోయాయి. దీంతో ఆయన్ను మలేసియాలోని కౌలాలంపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఇక అక్కడి నుంచి చెన్నై తీసుకొచ్చి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకుంది, ఇక ఇటీవలే షూటింగ్ కూడా మొదలుపెట్టారు.