Bichagadu 2 | కన్నీళ్లు తెప్పిస్తున్న బిచ్చగాడు 2 చెల్లీ వినవే వీడియో సాంగ్
Bichagadu 2 | విజయ్ ఆంటోనీ (Vijay Antony) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం బిచ్చగాడు 2 (Bichagadu 2) నుంచి ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం రెండో సాంగ్ చెల్లీ వినవే.. నా తల్లీ వినవే (ChelliVinave) వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు.
Bichagadu 2 | విజయ్ ఆంటోనీ (Vijay Antony) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం బిచ్చగాడు 2 (Bichagadu 2). విజయ్ ఆంటోనీ స్వయంగా డైరెక్ట్ చేస్తూ.. హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ఇవాళ బిచ్చగాడు 2 నుంచి రెండో సాంగ్ చెల్లీ వినవే.. నా తల్లీ వినవే (ChelliVinave) వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు. భాష్య శ్రీ రాసిన ఈ పాటను విజయ్ ఆంటోనీ కంపోజిషన్‌లో అనురాగ్ కులకర్ణి పాడాడు.
విజయ్ ఆంటోనీ చెల్లెలి కడుపు నింపేందుకు బిచ్చమడుక్కుంటూ.. నేనూ, నా చెల్లి తిని రెండు రోజులయ్యింది అక్కా.. బిచ్చమేయండి.. అక్కా అంటున్న విజువల్స్ ప్రేక్షకుల కంట కన్నీళ్లు తెప్పించేలా సాగుతున్నాయి. చెల్లీ వినవే నా తల్లీ వినవే నీ అన్నను కాను అమ్మే నేనూ.. అంటూ బిచ్చగాళ్ల దీనస్థితిని కండ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేసిన విజయ్ ఆంటోనీకి అందరూ సెల్యూట్ చేస్తున్నారు. బిచ్చగాడు 2 బాక్సాఫీస్ వద్ద రికార్డులను కొల్లగొట్టడం ఖాయమని ఈ ఒక్క పాటతో చెప్పేయొచ్చంటున్నారు సినీ జనాలు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన యాంటీ బికిలి థీమ్ సాంగ్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. బిచ్చగాడు 2కు విజయ్ ఆంటోనీ సంగీతమందిస్తున్నాడు. బిచ్చగాడు 2లో హరీష్ పేరడి, దేవ్ గిల్, జాన్ విజయ్, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోం బ్యానర్ విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు. బిచ్చగాడు 2 ఏప్రిల్ 14న తెలుగు,తమిళంతోపాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది. బిచ్చగాడు ప్రాంచైజీలో వస్తున్న సీక్వెల్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
చెల్లీ వినవే వీడియో సాంగ్
బిచ్చగాడు 2 థీమ్ సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

