MS Dhoni | విఘ్నేశ్ శివన్ డైరెక్షన్లో ఎంఎస్ ధోనీ.. క్రేజీ అప్డేట్ వివరాలివే
MS Dhoni | విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ ( MS Dhoni)కి వీరాభిమాని అని తెలిసిందే. తాను ఎంతగానో ఆరాధించే ఎంఎస్ ధోనీని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా అలాంటి అరుదైన అవకాశమే విఘ్నేశ్ శివన్‌కు వచ్చింది.
MS Dhoni | కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan). లేడీ సూపర్ స్టార్ నయనతార భర్తగా, స్టార్ డైరెక్టర్‌గా విఘ్నేశ్ శివన్‌కు సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ లీడింగ్ డైరెక్టర్‌కు స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ ( MS Dhoni)కి వీరాభిమాని అని తెలిసిందే. తాను ఎంతగానో ఆరాధించే ఎంఎస్ ధోనీని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా అలాంటి అరుదైన అవకాశమే విఘ్నేశ్ శివన్‌కు వచ్చింది. ఇంతకీ ఏ సినిమా కోసమై ఉంటుందా అని ఆలోచిస్తున్నారా..?.
ఈ ఇద్దరూ ఓ యాడ్ షూట్ కోసం ఇలా ఒక్క చోట చేరారు. యాడ్ షూట్లో భాగంగా ధోనీకి సీన్ వివరిస్తున్న స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. నేను ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతానో.. అలాంటి రోల్ మోడల్‌కు దర్శకత్వం వహించడం.. నేను ఇష్టపడే స్టార్‌కు యాక్షన్ చెప్పడం.. ఎక్జయిటింగ్‌గా ఉందంటూ క్యాప్షన్ ఇచ్చాడు విఘ్నేశ్ శివన్. తమిళనాడులో వన్ ఆఫ్ ది లీడింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీ G Square Housing కోసం ఈ టీవీ కమర్షియల్ యాడ్ తెరకెక్కిస్తున్నారు.
ఈ ఏడాది హోం బ్యానర్ ధోనీ ఎంటర్టైన్మెంట్స్ లో ఎల్జీఎం సినిమా తెరకెక్కించి సతీమణి సాక్షితో కలిసి చిత్ర నిర్మాణరంగంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు ఎంఎస్ ధోనీ. ధోనీ సంతకం చేసిన విఘ్నేశ్ శివన్ టీ షర్ట్ వీడియో గతంలో వైరల్ అయిన విషయం తెలిసిందే. విఘ్నేశ్ శివన్ ప్రస్తుతం లవ్‌టుడే ఫేం ప్రదీప్ రంగనాథన్‌తో నెక్ట్స్ సినిమా చేస్తున్నాడు.
యాడ్ షూట్ కోసం ఇలా..
#VigneshShivan is Directing AD Shoot For Thala #MSDhoni & #YogiBabu pic.twitter.com/tsEBZDY9AP
— Diamond Babu (@idiamondbabu) October 17, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

