Viduthalai Part-1 Collections | హీరోల ఇమేజ్‌తో సంబంధంలేకుండా కేవలం కథకు ఏది కావాలో దాన్ని మాత్రమే తెరకెక్కించే దర్శకుడు వెట్రిమారన్. ఆయన సినిమాల్లోని హీరో పాత్రకు భారీ ఎలివేషన్లు, యాక్షన్ సీన్లు గట్రా ఏమి ఉండవు. ఎంత పెద్ద స్టార్ అయినా సరే.. కథకు ఏమి కావాలో అది మాత్రమే తీస్తాడు. అందుకేనేమో అవార్డులు సైతం ఆయనకు దాసోహం అవుతుంటాయి. తమిళంలో వెట్రిమారన్‌కు యమ క్రేజ్ ఉంది. కేవలం పోస్టర్‌పై ఆయన పేరు కనిపిస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడిపోతుంటారు. ఇక ఇటీవలే ఆయన దర్శకత్వం వహించిన విడుతలై పార్ట్-1 రిలీజ్ అయింది.
తొలిరోజు నుంచి పాజిటీవ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వరద పొంగుతుంది. కమెడియన్ సూరిని ప్రధాన పాత్రలో పెట్టి వెట్రీ ఈ సినిమాను తెరకెక్కించాడు. విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటించాడు. మూడు రోజుల క్రితం రిలీజైన ఈ సినిమా తమిళ బాక్సాఫీస్‌పై రఫ్ఫాడిస్తుంది. రెండు రోజుల్లోనే పది కోట్ల రేంజ్ కలెక్షన్‌ను సాధించి చెన్నై విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో పడేసింది. తొలి రోజుతో పోల్చితే మూడో రోజు కలెక్షన్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. మూడు, నాలుగు రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయని చెన్నై టాక్. దీని దెబ్బకు శింబు పతుతాల కలెక్షన్లకు కూడా స్లో అయిపోయాయి.
మాములుగానే వెట్రిమారన్ సినిమాల్లో హింస కాస్త ఎక్కువ మొతాదులోనే ఉంటుంది. ఇందులో డోస్ ఇంకొంచెం పెంచాడు. సెన్సార్ కూడా ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్‌ను ఇచ్చింది. ఇక పలువురు రివ్యూయర్లు కూడా సున్నిత మనస్కులు, చిన్న పిల్లలకు దూరంగా ఉండమని పేర్కొంటున్నారంటే ఈ సినిమాలో హింస ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. నటులుగా విజయ్ సేతుపతి, సూరి విధ్వంసం సృష్టించారు. ఇక తెలుగులోనూ ఈ సినిమాను డబ్బింగ్ చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు టాక్.