Vidudhala Part-1 Movie | ఉత్కంఠ రేపుతున్న విడుదల పార్ట్-1 తెలుగు ట్రైలర్.. ప్రజాదళంతో పోలీసుల ఫైట్
Vidudhala Part-1 Movie Telugu Trailer | తమిళ దర్శకుడు వెట్రిమారన్ సినిమాలను అన్ని భాషల ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్ని బ్లాక్‌బస్టర్ హిట్లే. కమర్షియల్‌గానే కాదు క్రిటిక్స్ నుంచి కూడా గొప్ప ప్రశంసలు అందుకున్నాయి.
Vidudhala Part-1 Movie Telugu Trailer | తమిళ దర్శకుడు వెట్రిమారన్ సినిమాలను అన్ని భాషల ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్ని బ్లాక్‌బస్టర్ హిట్లే. కమర్షియల్‌గానే కాదు క్రిటిక్స్ నుంచి కూడా గొప్ప ప్రశంసలు అందుకున్నాయి. విసరనై, వడివసాల్, వడ చెన్నై, అసురన్ వంటి పలు అద్భుతమైన సినిమాలు వెట్రి తెరకెక్కించాడు. ఇక ఆయన దర్శకత్వం వహించిన విడుతలై పార్ట్-1 వారం రోజుల కిందట తమిళంలో రిలీజై సంచలన వసూళ్లను సాధిస్తుంది. ప్రముఖ కమెడియన్ సూరిని హీరోగా పెట్టి వెట్రిమారన్ ఈసినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా వచ్చే వారం తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
తాజాగా రిలీజైన ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తి రేకెత్తిస్తుంది. ట్రైలర్‌ను గమనిస్తే అడవి బిడ్డలైన గిరిజనులకు, పోలీస్ వారికి మధ్య నడిచే పోరాటంగా ఈ కథ తెరకెక్కినట్లు కనిపిస్తుంది. గిరిజనులకు అండగా విజయ్ సేతుపతి పెరుమాళ్‌గా కీలకపాత్ర పోషిస్తుండగా, సూరి కానిస్టేబుల్ పాత్ర పోషిస్తున్నాడు. పోలీసులకు సమస్యగా మారిన పెరుమాళ్‌ను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు గిరిజనులను హింసిస్తుంటారు. అప్పుడు పెరుమాళ్ పోలీసులను ఎలా అడ్డుకుంటాడు? పెరుమాళ్‌ను పట్టుకునేందుకు సూరి తన పై అధికారులకు ఎలాంటి సహాయం చేశాడు అనే అంశాలను ట్రైలర్లో చూపించారు. మనిషి పుట్టగానే.. ఒకరు పైన, ఇంకొకరు కింద, మరొకరు ఇంకా కింద అని వేరు చేసే మీరు వేర్పాటువాదులా? లేదా అందరం సమానమని పోరాడే మేము వేర్పాటు వాదులమా? అంటూ విజయ్ సేతుపతి చెప్పే డైలాగ్ ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచింది.
ఇలాంటి కథను ఇప్పటివరకు మనం ఎన్నో సార్లు చూసే ఉంటాం. కానీ వెట్రీమారన్ స్టైల్ మేకింగ్ వేరే లెవల్లో ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమాకు తమిళంలో అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి. తెలుగులోనూ అదే స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందని చిత్రబృందం ధీమాగా ఉంది. ఇక తెలుగులో ఈ సినిమాను అల్లు అరవింద్ పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకంటే ముందు రోజు శాకుంతలం, రుద్రుడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరీ ఈ రెండు సినిమాల పోటీని తట్టుకుని విడుదల సినిమా నిలుస్తుందా? లేదా? అనేది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

