Vicky Kaushal | బరువు తగ్గడం అంటే మామూలు విషయం కాదు. జీవన శైలిలో కఠిన నియమాలు పాటించాలి. ఇష్టమైన ఆహారానికి దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు. క్రమం తప్పకుండా వాకింగ్, యోగా చేయాల్సి ఉంటుంది. అధిక పోషకాలు కలిగిన ఆహారం, పండ్లు, సలాడ్స్ తీసుకోవాలి. అయితే బాలీవుడ్ స్టార్ నటుడు మాత్రం ఇవేవీ తీసుకోకుండానే ఈజీగా బరువు తగ్గేస్తాడంట. ఇది అతను తనకున్న ‘అందమైన సమస్య’గా చెప్పుకుంటున్నాడు మరి. అతనెవరో తెలుసా..? టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ కత్రినాకైఫ్ భర్త విక్కీ కౌశల్.
బిగ్‌బీ అమితా బచ్చన్ హోస్ట్‌గా చేస్తున్న షోకు బాలీవుడ్ నటి కియారా అడ్వానీతో కలిసి విక్కీ వచ్చాడు. అక్కడ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘నాకో అందమైన సమస్య ఉంది. నేను బరువు పెరగడం లేదు. ముఖ్యంగా జంక్ ఫుడ్స్.. పిజ్జా, బర్గర్లు వంటివి తినడంతో బరువు తగ్గుతా’ అంటూ చొప్పుకొచ్చాడు. విక్కీ మాటలతో బిగ్‌బీ, కియారా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం విక్కీ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.