Rashmika | మాటలకందని భావం ‘ఛావా’
“ఛావా’ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమించాను. యుద్ధవిద్యలు, గుర్రపుస్వారీలో శిక్షణ తీసుకున్నా. ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం అన్నింటికంటే పెద్ద సవాలుగా అనిపించింది’ అన్నారు బాలీవుడ్ అగ్ర హీరో విక్కీకౌశల్. ఆయన కథానాయకుడిగా నటించిన చారిత్రక చిత్రం ‘ఛావా’.
Rashmika | “ఛావా’ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమించాను. యుద్ధవిద్యలు, గుర్రపుస్వారీలో శిక్షణ తీసుకున్నా. ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం అన్నింటికంటే పెద్ద సవాలుగా అనిపించింది’ అన్నారు బాలీవుడ్ అగ్ర హీరో విక్కీకౌశల్. ఆయన కథానాయకుడిగా నటించిన చారిత్రక చిత్రం ‘ఛావా’. మరాఠీ యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకుడు. రష్మిక మందన్న కథానాయికగా నటించింది. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం చిత్ర బృందం హైదరాబాద్‌కు విచ్చేసింది.
ఈ సందర్భంగా విక్కీకౌశల్ మాట్లాడుతూ ‘ఈ సినిమా ద్వారా నిజమైన యోధుల కథను చెబుతున్నందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి పాత్ర పోషించే అవకాశం జీవితంలో ఒకేసారి వస్తుంది. ఇది నా అదృష్టం. రెహమాన్ సంగీతం సినిమా స్థాయిని మరింత పెంచింది’ అన్నారు. రష్మిక మందన్న మాట్లాడుతూ ‘ఈ కథలో మాటలకందని భావం, దైవత్వం, అంతులేని ప్రేమ ఉంటాయి. అందుకే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. ఈ సినిమా చూసిన ప్రతీసారి కన్నీళ్లొచ్చేవి. విక్కీకౌశల్ గొప్ప నటుడు. ఆయన పక్కన ఉంటే ఓ మ్యాజిక్‌లా అనిపిస్తుంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుంది’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

