Ranga Ranga Vaibhavanga Movie | ‘రంగ రంగ వైభవంగా’ థర్డ్ సింగిల్ ప్రోమో విడుదల
Ranga Ranga Vaibhavanga Third Single Promo | డెబ్యూ సినిమాతో రికార్డులు సృష్టించాడు మెగా మెనల్లుడు వైష్ణవ్ తేజ్. ‘ఉప్పెన’ సినిమాతో ఉప్పెనలాంటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత వచ్చిన ‘కొండపొలం’ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. నిజానికి ఈ చిత్రం వచ్చిన విషయమే చాలా మందికి తెలియదు. ఈ సినిమా ఫలితం వైష్ణవ్ తేజ్‌ను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ప్రస్తుతం ఈయన నటించిన ‘రంగరంగ వైభవంగా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్ ‘ఆదిత్య వర్మ’ చిత్రాన్ని తెరకెక్కించిన గిరీశయ్య ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ క్రమంలో చిత్ర బృందం తరచూ ఒక అప్డేట్తో ప్రేక్షకులను పలకరిస్తుంది. తాజాగా మేకర్స్ థర్డ్ సింగిల్ ప్రోమోను విడుదల చేశారు.
ఈ చిత్రంలోని ‘సిరి సిరి మువ్వల్లోన’ అంటూ సాగే మెలోడీయస్ సాంగ్ ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఫుల్ లిరికల్ సాంగ్‌ను ఆగస్టు 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన కొత్తగా లేదేంటి, తెలుసా తెలుసా సాంగ్‌లకు శ్రోతల నుండి విశేష స్పందన వచ్చింది. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటలు అప్పటి దేవిని గుర్తుచేస్తున్నాయి. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్‌కు జోడీగా కేతికశర్మ హీరోయిన్గా నటించింది. ఇటీవలే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

