Rajinikanth | సూపర్‌స్టార్ రజనీ ఇమేజ్‌కి భిన్నమైన కథతో..
రజనీకాంత్ ‘వేట్టయాన్' సినిమాకోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్లాక్బాస్టర్ ‘జైలర్' తర్వాత ఆయన పూర్తి స్థాయి హీరోగా నటిస్తున్న చిత్రం ‘వేట్టయాన్'.
Rajinikanth | రజనీకాంత్ ‘వేట్టయాన్’ సినిమాకోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్లాక్బాస్టర్ ‘జైలర్’ తర్వాత ఆయన పూర్తి స్థాయి హీరోగా నటిస్తున్న చిత్రం ‘వేట్టయాన్’. ఈ సినిమా గురించి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న రానా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆయన తాజా ఇంటర్వ్యూలో ‘వేట్టయాన్’ గురించి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను భాగమైనందుకు చాలా ఆనందిస్తున్నాను. రజనీసార్‌తో నటించాలనే నా చిన్ననాటి కల ఇన్నాళ్లకు నెరవేరింది.
దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ ఈ కథ చెప్పగానే షాక్ అయ్యాను. అద్భుతమైన కథ. తొలి సిట్టంగ్లోనే నన్ను ఇన్స్పైర్ చేశాడు. జ్యుడిషియల్ వ్యవస్థ నేపథ్యంలో సినిమా ఉంటుంది. ఎంతో పరిశోధించి జ్ఞానవేల్ చేసుకున్న స్క్రిప్ ఇది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇది రజనీ మార్క్ సినిమా కాదు. ఆయన ఇమేజ్‌కి పూర్తి భిన్నమైన కథ. అమితాబ్జీ కూడా ఇందులో భాగం కావడం, ఆయనతో కూడా నేను నటించడం నాకు డబుల్ బొనాంజా అనమాట. ఫహద్ ఫాజిల్ కూడా ఇందులో ఉన్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అక్టోబర్‌లో విడుదల అంటున్నారు. ఎప్పుడెప్పుడు చూస్తానా అని నాకూ ఆసక్తిగానే ఉంది.’ అన్నారు రానా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

