Vetri Maaran | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran) టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కాంబినేషన్లో సినిమా రాబోతుందని తెలిసిందే. ఎవరూ ఊహించని క్రేజీ కాంబినేషన్ వస్తుందన్న విషయం తెలియగానే ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు మూవీ లవర్స్. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో.. ఎలాంటి జోనర్లో ఉండబోతుందోనంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే మూవీ లవర్స్‌తోపాటు నందమూరి అభిమానుల కోసం ఓ క్రేజీ అప్డేట్ అందించాడు వెట్రిమారన్.
వెట్రిమారన్ ఇవాళ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విడుతలై పార్ట్-1 తెలుగు వెర్షన్ స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరయ్యాడు. నటుడు సూరి, సమర్పకుడు అల్లు అరవింద్ కూడా స్క్రీనింగ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో చిట్‌చాట్ సెషన్లో తారక్ సినిమా గురించి అప్డేట్ అందించి మూవీ లవర్స్ లో జోష్ నింపాడు. నేను జూనియర్ ఎన్టీఆర్‌ను కలిశా. ఆయనతో తప్పకుండా సినిమా ఉంటుంది.. కానీ కొంత సమయం పడుతుందని వెట్రిమారన్ చెప్పాడు. గుడ్ న్యూస్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చి జోష్ నింపాడు వెట్రిమారన్.
విడుతలై పార్ట్-1 ఏప్రిల్ 15న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. త్వరలోనే విడుతలై పార్టు 2 షూటింగ్‌ను త్వరలోనే షురూ చేయబోతున్నాడు. ఈ గ్యాప్‌లో తారక్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఎన్టీఆర్ 30ని పూర్తి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక వెట్రిమారన్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏమైనా వస్తుందేమో చూడాలి.
Virupaksha Trailer | ఎవరికైనా చావుకెదురెల్లే దమ్ముందా..? సస్పెన్స్‌గా విరూపాక్ష ట్రైలర్
Shaakuntalam | సమంత శాకుంతలం సెన్సార్ అప్డేట్.. రన్‌టైం ఎంతో తెలుసా..?