సీఐ జమ్మి మురళి పాత్రలో కనిపించబోతున్నారు వేణు తొట్టెంపూడి. రవితేజ హీరోగా నటిస్తున్న‘రామారావు ఆన్ డ్యూటీ’. సినిమాలో ఆయన ఈ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ నాయికలు. యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు శరత్ మండవ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, ఆర్టీ టీమ్ వర్క్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలై 29న విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి వేణు తొట్టెంపూడి క్యారెక్టర్ లుక్ను విడుదల చేశారు. ఈ లుక్లో ఆయన సీఐ జమ్మి మురళి పాత్రలో కనిపిస్తున్నారు. హీరోతో పాటు కథ ఆద్యంతం సాగే క్యారెక్టర్ ఇదని చిత్రబృందం తెలిపారు.