Venu Swamy | సమంత-రాజ్ వివాహంపై వేణుస్వామి స్పందన… ఇలాంటి బాంబ్ పేల్చాడేంటి?
Venu Swamy | ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వివాదాల కేంద్రబిందువుగా మారాడు. అక్కినేని నాగ చైతన్య–సమంత విడాకులపై గతంలో వేణుస్వామి చేసిన కామెంట్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. ఆయన చెప్పిన మాట నిజం కావడంతో కొందరు ఆయనకు “మహిమలు ఉన్నాయి” అని అనగా, జగన్ విషయంలో అంచనాలు తలకిందులు అయ్యాయి.
Venu Swamy | ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వివాదాల కేంద్రబిందువుగా మారాడు. అక్కినేని నాగ చైతన్య–సమంత విడాకులపై గతంలో వేణుస్వామి చేసిన కామెంట్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. ఆయన చెప్పిన మాట నిజం కావడంతో కొందరు ఆయనకు “మహిమలు ఉన్నాయి” అని అనగా, జగన్ విషయంలో అంచనాలు తలకిందులు అయ్యాయి. మరోవైపు పవన్ కళ్యాణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆయన విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తాయి. రాజకీయాలకూ, ఇండస్ట్రీకూ దూరంగా ఉన్న ఆయన ప్రస్తుతం యూట్యూబ్‌లో జాతకాలు చెప్పడంపై దృష్టి పెట్టారు.
సమంత–రాజ్ వివాహం నేపథ్యంలో వారి జాతక ఫలితాలను చెప్పాలని కొంతమంది అభిమానులు, నెటిజన్లు జ్యోతిష్యుల్ని సంప్రదిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో విడుదల చేస్తూ.. గతేడాది నాగచైతన్య–శోభిత వివాహం జరిగినప్పుడు వారిని ఏ హక్కుతో జాతకాలు బయటపెట్టావని నన్ను విమర్శించినవాళ్లు… ఇప్పుడు సమంత–రాజ్ భవిష్యత్తు ఎలా ఉంటుందని జ్యోతిష్యుల్ని ఎందుకు అడుగుతున్నారు? అని ఆయన ప్రశ్నించాడు. సమంత–రాజ్ దాంపత్యంపై ప్రజలు అడుగుతున్న ప్రశ్నలను కూడా ఆయన వీడియోలో ప్రస్తావించాడు. “మగ పిల్లాడు పుడతాడా? ఆడ పిల్ల పుడుతుందా? ఇద్దరూ కలిసి ఉంటారా? విడిపోతారా? మౌడమిలో పెళ్లి చేసుకున్న సమంత జీవితం ఎలా ఉంటుంది?” వంటి ప్రశ్నలు వస్తున్నాయని చెప్పారు.
అయితే “సమంత కానీ, రాజ్ కానీ నన్ను సంప్రదించి జాతకం చెప్పమని అడగలేదు. మరి ఇతరులు ఎందుకు ఈ ఆసక్తి చూపుతున్నారు?” అంటూ ప్రజల ఆతృతను ఆయన ఎద్దేవా చేశారు.తాను ప్రస్తుతం ఒక పెద్ద సినిమా విజయం కోసం జరుగుతున్న పూజల్లో ఉన్నానని తెలిపారు. మూడు రోజులుగా మేకర్స్ పూజలు చేయిస్తున్నారు. అక్కడే ఉన్నాను. మిగతా విషయాలన్నీ నాకు అనవసరం. వెంకటేశ్వర స్వామి, చిన్న మస్తాదేవి అమ్మవారి ఆశీర్వాదంతోనే నేను ముందుకు సాగుతున్నాను అని వేణుస్వామి స్పష్టం చేశాడు. వేణుస్వామి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన మాట్లాడిన తీరు, వేసిన ప్రశ్నలు, ప్రజల ఆసక్తిపై తన్నే ప్రశ్నించుకున్న తీరు కొందరికి ఆశ్చర్యం కలిగిస్తుండగా, మరికొందరు ఏదో చెబుతాడనుకున్నాం… ఏంటి ఇలా బాంబ్ పేల్చాడు? అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ 2nd ODI | వర్షం కారణంగా 47 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
Scene | తెలుగులో ‘సీన్’కు నిరాశాజనక ఆరంభం.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో వంశీకి కెప్టెన్సీ.. ఫ్యామిలీ కోసం ముకేశ్‌కు వర్షిణి త్యాగం, నరేష్‌పై అమన్, ఆర్కే ఆగ్రహం!
Inter Exams | ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. తొలిసారిగా ఫస్టియర్‌కు ప్రాక్టికల్స్
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

