Icon movie | అల్లుఅర్జున్ ‘ఐకాన్’ కథను.. ఉస్తాద్ రామ్ చేయనున్నాడా?
తినే బియ్యపుగింజ మీద మన పేరు రాసుండాలి అని సాధారణంగా అంటుంటారు. అదే విధంగా సినిమా రంగంలో హీరోల దగ్గరికి వచ్చే కథలపై వారి పేరు రాసిపెట్టుండాలి అంటారు. ఇదే కోవలో వచ్చిన చిత్రం 'అర్జున్ రెడ్డి'.
Icon movie | తినే ప్రతి బియ్యపుగింజ మీద మన పేరు రాసుండాలి అని సాధారణంగా అంటుంటారు. అదే విధంగా సినిమా రంగంలో హీరోల దగ్గరికి వచ్చే కథలపై వారి పేరు రాసిపెట్టుండాలి అంటారు. ఇదే కోవలో వచ్చిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. మొదట ఈ కథ అల్లు అర్జున్ దగ్గరకు ఆ తరువాత శర్వానంద్ దగ్గరకు వెళ్ళిందట. కానీ కొన్ని కారణాలు వల్ల ఆ ఇద్దరు అర్జున్ రెడ్డి సినిమాను వదులుకున్నారు. చివరగా ఆ చిత్ర కథ విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చింది. ఈ సినిమా విజయ్ దేవరకొండకు విపరీతమైన క్రేజ్‌తో పాటు స్టార్ స్టేటస్‌ను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో విజయ్ నటించనున్న ‘జనగణమన’ చిత్రం కూడా మొదట మహేష్‌బాబు, పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లింది. ఇవే కాకుండా చాలా వరకు సినిమాలు ఒక హీరో చేయాలనుకున్నవి మరో హీరో దగ్గరకు వెళ్ళి బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించాయి. ఇక ఇప్పుడు తాజాగా ఒక స్టార్ హీరో చేయాలనుకున్న కథ మరో హీరో దగ్గరికి వెళ్లిందని సమాచారం.
‘వకీల్ సాబ్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు వేణు శ్రీరామ్. వకీల్ సాబ్ తర్వాత ఈయన అల్లుఅర్జున్‌తో ‘ఐకాన్’ చిత్రాన్ని చేయాలని భావించాడు. బన్నీ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చింది.ఇక ‘పుష్ప’ చిత్రంతో బన్నీ క్రేజ్ అమాంతంగా పెరిగింది. తన తదుపరి సినిమాలు కూడా పుష్ప స్థాయిలోనే ఉండాలని ప్లాన్ చేస్తున్నాడట. ఐకాన్ కథ పాన్ ఇండియా రేంజ్ కథ కాదని, దాంతో ఐకాన్ చిత్రాన్ని చేయడానికి బన్నీ ఆసక్తి చూపడంలేదని సమాచారం. దాంతో వేణు శ్రీరామ్ ఐకాన్ కథను ఉస్తాద్ రామ్ పోతినేనితో చేయాలని చర్చలు జరుపుతున్నాడని టాక్. రామ్ ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్లో దిల్‌రాజుతో కలిసి నిర్మించనున్నడని సమాచారం.ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం అనంతరం బోయపాటి శ్రీనుతో అవుట్ఆండ్అవుట్ మాస్ యాక్షన్ చిత్రాన్ని చేయనున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

