టాలీవుడ్ హీరో ఆదిసాయికుమార్ (Aadi Saikumar) నటిస్తున్న చిత్రం టాప్ గేర్ (Top Gear). కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీని శశికాంత్ డైరెక్ట్ చేస్తున్నాడు. టాప్ గేర్ నుంచి టాలెంటెడ్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఫస్ట్ సింగిల్ వెన్నెల వెన్నెల పాట ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.
సిద్ శ్రీరామ్ మరోసారి మ్యాజిక్ చేయబోతున్నట్టు ప్రోమో ద్వారా తెలుస్తోంది. నవంబర్ 25న ఫుల్ సాంగ్‌ను లాంఛ్ చేయనున్నారు. శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్ట్ తెలుగులో నవలా కాన్సెప్ట్ జోనర్లో వస్తున్న తొలి సినిమా.
ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. రియా సుమన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ ఈ చిత్రానికి పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఆది ఈ సినిమాతోపాటు జంగిల్, కిరాతక, అమరన్ ఇన్ ది సిటీ.. చాఫ్టర్ 1, సీఎస్ఐ సనాతన్ చిత్రాల్లో నటిస్తున్నాడు.
వెన్నెల వెన్నెల సాంగ్ ప్రోమో..
Here's a glimpse of the delightful melody #VennelaVennela
Full song on November 25th#TOPGEAR🚗@iamaadisaikumar @IRiyaSuman#Shashikanth @adityamovies #SriDhanaLakshmiProductions#KVSridharReddy #GiridharMamdipally #SaiSreeram #PrawinPudi @adityamusic @PROSaiSatish pic.twitter.com/NN3vx5n3Nf
— BA Raju's Team (@baraju_SuperHit) November 23, 2022