Saindhav Movie | టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ (Venkatesh) నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్ (SAINDHAV). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రమిది కావడం విశేషం. సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌తో పాటు పాటలకు ఆడియోన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తే.. వెంకీ కూతురు కండరాలకు సంబంధించిన ‘స్పైనల్ మాస్క్యూలర్ ఎట్రోఫి’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంటుంది. అయితే ఈ వ్యాధి నుంచి పాప బయటపడాలంటే రూ.17 కోట్ల విలువైన ఓ ఇంజెక్షన్ పాపకు ఇవ్వాలి. ఈ నేపథ్యంలో వెంకీ తన పాపను రక్షించుకోవడానికి రూ.17 కోట్లు ఎలా తీసుకోచ్చాడు. అతడికి చంద్రప్రస్థ పోర్ట్‌కు ఉన్న స్టోరీ ఏంటి అనేది తెలియాలంటే జనవరి 13న సినిమా చూడాల్సిందే. ఇక చాలా రోజుల తర్వాత వెంకీ మాస్ అవతార్‌లో కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
ఈ పాన్ ఇండియా మూవీని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి భారీ స్థాయిలో నిర్మిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.