Venkatesh | టాలీవుడ్ హీరోల్లో క్రికెట్ లవర్స్ ఉన్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటాడు వెంకటేశ్ (Venkatesh). ఎప్పుడూ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉండే వెంకీ మామ మంచి క్రికెట్ లవర్ అని తెలిసిందే. ఎక్కడైనా క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు.. ఆ షెడ్యూల్‌ను సెట్ చేసుకొని మరి అక్కడ వాలిపోతుంటాడు. తాజాగా ముంబైలో జరుగుతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సందడి చేశాడు వెంకటేశ్.
వెంకటేశ్ వెస్టిండీస్ లెజెండరీ మాజీ క్రికెట్ దిగ్గజం వివిన్ రిచర్డ్స్ (Vivian Richards)తో సెల్ఫీ దిగాడు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో దిగ్గజ క్రికెటర్ వివిన్ రిచర్డ్స్‌తో కలిసి ఉండటం ఆనందంగా ఉంది.. అంటూ ట్వీట్ చేశాడు వెంకీ. ఈ సెల్ఫీ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఈ సెల్ఫీ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు, అభిమానులు వెంకీ మామ నిజమైన క్రికెట్ ఫ్యాన్.. ఇవాళ గ్రాండ్ విక్టరీ మామా.. మీరు వెళ్లారు కదా ఇవాళ మ్యాచ్ మనదే.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు లెజెండ్స్.. వెంకీ మామా సూపర్ ఫొటో.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు .
వెంకటేశ్ ప్రస్తుతం టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం సైంధవ్ (SAINDHAV). హిట్ ఫేం శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వెంకటేశ్ 75వ సినిమాగా వస్తోన్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే మిషన్ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞగా కనిపించనుంది. రుహానీ శర్మ డాక్టర్‌గా, నవాజుద్దీన్ సిద్దిఖీ వికాస్ మాలిక్ పాత్రలో, కోలీవుడ్ యాక్టర్ ఆర్య మానస్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన సైంధవ్ గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. సైంధవ్.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 2024 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి తెరకెక్కిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
లెజెండరీ క్రికెటర్‌తో సెల్ఫీ..
Delighted to be with the legendary Viv Richards at the #IndvsNZ Semi-final 😎❤️ pic.twitter.com/6A5MvqRZrn
— Venkatesh Daggubati (@VenkyMama) November 15, 2023
మానస్ లుక్..
Meet @arya_offl as #MANAS in #SAINDHAV on the big screens from DECEMBER 22nd 🔥#SaindhavOn22ndDEC ❤️🔥 pic.twitter.com/8P05gHCHxQ
— Niharika Entertainment (@NiharikaEnt) August 30, 2023
శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞ లుక్..
Team #SAINDHAV wishes their MANOGNYA aka @ShraddhaSrinath a very Happy Birthday❤️
Her presence & performance both will have you hooked to the screens 💥
Victory @VenkyMama @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt… pic.twitter.com/NgPRp2n2km
— Niharika Entertainment (@NiharikaEnt) September 29, 2023
నవాజుద్దీన్ సిద్దిఖీ లుక్..
Team #SAINDHAV wishes the National Award-Winning Actor @Nawazuddin_S a very Happy Birthday💥
&
Introducing him as the fearsome ‘Vikas Malik’❤️🔥#SaindhavOnDec22Victory @VenkyMama @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @maniDOP… pic.twitter.com/HaFW8sbOKK
— Niharika Entertainment (@NiharikaEnt) May 19, 2023
ఇండిపెండెన్స్ డే స్పెషల్..
సైంధవ్ గ్లింప్స్ వీడియో..