Drushyam 2 Trailer | వెంకటేష్ ‘దృశ్యం 2’ ట్రైలర్ వచ్చేసింది.. సస్పెన్స్ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్
వెంకటేష్ ‘దృశ్యం 2’ ట్రైలర్ వచ్చేసింది | ఏడేళ్ల కిందట ఓ దర్శకుడికి వచ్చిన చిన్న ఆలోచన ప్రపంచమంతా ప్రశంసల వర్షం కురిపించింది. ఆ దర్శకుడు జీతూ జోసెఫ్

Drushyam 2 Trailer | ఏడేళ్ల కిందట ఓ దర్శకుడికి వచ్చిన చిన్న ఆలోచన ప్రపంచమంతా ప్రశంసల వర్షం కురిపించింది. ఆ దర్శకుడు జీతూ జోసెఫ్(Jeethu Joseph).. ఆ సినిమా దృశ్యం. 2013లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, చైనీస్ భాషల్లోకి కూడా రీమేక్ అయ్యింది. అన్ని చోట్ల అద్భుతమైన విజయం సాధించింది దృశ్యం. దాంతో ఈ సినిమాకు సీక్వెల్ చేశాడు జీతు జోసెఫ్. ఫిబ్రవరి 19న మలయాళంలో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. కరోనా కారణంగా అప్పుడు థియేటర్స్ క్లోజ్ కావడంతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది.

దాంతో ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేశారు. మరోసారి వెంకటేష్(Venkatesh Daggubati), మీనా(Meena) జంటగా నటించారు. దృశ్యం సినిమాలో ఎవరైతే నటించారో.. మళ్లీ అందరూ ఇందులో తిరిగి కనిపించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే సినిమా కచ్చితంగా విజయం అందుకోవడం ఖాయం అనిపిస్తుంది. సస్పెన్స్ ఫ్యామిలీ డ్రామాగా దృశ్యం 2(Drushyam 2) సినిమా తెరకెక్కించాడు దర్శకుడు జీతు జోసెఫ్. తెలుగు సినిమాను కూడా నేరుగా ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నారు. ఇక్కడ కూడా థియేటర్స్ ఓపెన్ అయినా ముందుగా చేసుకున్న కూడా.. ఒప్పందం ప్రకారం అమెజాన్ ప్రైమ్ లో సినిమాను విడుదల చేయబోతున్నారు. నవంబర్ 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ ఏడాది నారప్ప సినిమాతో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వెంకటేష్. ఇప్పుడు మరోసారి దృశ్యం 2 సినిమా ఓటీటీ వేదికగానే విడుదల కానుంది. మొదటి భాగం ఎక్కడైతే ముగిసిందో రెండో భాగం అక్కడి నుంచి మొదలు పెట్టాడు దర్శకుడు జీతు. శవాన్ని పోలీస్ స్టేషన్లో పాతిపెట్టడంతో దృశ్యం మొదటి భాగం పూర్తవుతుంది. రెండోభాగంలో కేస్ రీ ఓపెన్ చేయడంతో కథ మొదలవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Samantha As Khatija | సమంత పాత్రను పరిచయం చేసిన డైరెక్టర్..
Prakash Raj silence | నా గొంతుకు వారం విశ్రాంతి..ప్రకాశ్‌రాజ్ ట్వీట్ వైరల్
Biker Naatu Naatu Dance | ట్రాఫిక్ సిగ్నల్‌లో బైకర్ ‘నాటు నాటు’ డ్యాన్స్ ..వీడియో హల్చల్
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

