ప్రేక్షకులకు రానా క్షమాపణలు
వెంకటేష్, రానా కలిసి నటించి ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌పై ప్రేక్షకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వారికి క్షమాపణలు చెప్పారు రానా.
వెంకటేష్, రానా కలిసి నటించి ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌పై ప్రేక్షకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వారికి క్షమాపణలు చెప్పారు రానా. ఈ వెబ్ సిరీస్‌లో హింస, శృంగార సన్నివేశాల మోతాదు మించిందని, కుటుంబంతో కలిసి చూడలేకపోతున్నామని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. వెంకటేష్‌కు ఉన్న ఫ్యామిలీ హీరో ఇమేజ్‌తో చాలా మంది ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్‌ను చూడటం ప్రారంభించారు. అయితే ఇందులోని సన్నివేశాలు వారికి ఇబ్బందికరంగా మారాయి.
‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ప్రీమియర్ రోజున వెంకటేష్ మాట్లాడుతూ తన కెరీర్లో ఇప్పటిదాకా చేయని ఓ భిన్నమైన ప్రయత్నమిదని, దీంట్లో హింస, శృంగార సన్నివేశాలు ఉంటాయని చెబుతూ…సారీ చెప్పాడు. తాజాగా రానా సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కోరారు. కుటుంబంతో కలిసి ఈ వెబ్ సిరీస్ చూడొద్దని కోరారు. అమెరికన్ టీవీ క్రైమ్ డ్రామా సిరీస్ ‘రే డోనోవన్’ రీమేక్‌గా ఈ వెబ్ సిరీస్‌ను దర్శకులు కరణ్ అన్షుమన్, సుపర్ణ్ వర్మ తెరకెక్కించారు. రానా సెలబ్రిటీ ఫిక్సర్‌గా, వెంకటేష్ నేరస్తుడి పాత్రల్లో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ott
- Rana
- rana naidu
- Venkatesh
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

