Rana Naidu | ‘రానా నాయుడు’ టీజర్ రిలీజ్.. ఆసక్తి రేకెత్తిస్తున్న వెంకటేష్ లుక్స్
Rana Naidu Teaser | దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి రానా నాయుడు అనే వెబ్‌సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘రే డోనోవన్’ ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కింది. ఈ సిరీస్‌కు కరన్ హన్షుమాన్ దర్శకత్వం వహించాడు.
Rana Naidu Teaser | దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి రానా నాయుడు అనే వెబ్‌సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘రే డోనోవన్’ ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కింది. ఈ సిరీస్‌కు కరన్ హన్షుమాన్ దర్శకత్వం వహించాడు. బాబాయి, అబ్బాయిలు కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించనుండటంతో ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు వెబ్ సిరీస్ విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన రానా, వెంకటేష్ పోస్టర్లు భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌సిరీస్ టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
సాయం కావాలా? అని రానా డైలాగ్‌తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. సెలబ్రెటీలకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే.. రానా దాన్ని సాల్వ్ చేసే వ్యక్తిగా టీజర్లో కనిపించాడు. కాగా నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో రానా కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇక వెంకటేష్ జైల్లో నుండి రిలీజ్ అవుతున్నట్లు చూపించారు. వయసు మళ్ళిన పాత్రలో వెంకటేష్ లుక్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో వెంకటేష్, రానా దగ్గుబాటి తండ్రి, కొడుకులుగా కనిపించనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. ఇక చివర్లో వెంకటేష్‌పై రానా గన్ పెట్టే సీన్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. టీజర్‌తోనే మేకర్స్ వెబ్‌సిరీస్‌పై విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. నెట్‌ఫ్లిక్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

