Venkatesh | భర్త.. భార్య.. ప్రియురాలు.. వెంకటేశ్ తర్వాతి సినిమా కాన్సెప్ట్ ఇదే!
వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ఎఫ్1, ఎఫ్2 చిత్రాలు భారీ విజయాలను నమోదు చేసుకున్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కలయికలో సినిమా రానుంది. దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలు.
Venkatesh | వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ఎఫ్1, ఎఫ్2 చిత్రాలు భారీ విజయాలను నమోదు చేసుకున్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కలయికలో సినిమా రానుంది. దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలు. ఇది ప్రతిష్టాత్మక శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న 58వ సినిమాకావడం విశేషం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ సినిమా గురించి మేకర్స్ మాట్లాడుతూ ‘సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది.
ప్యాలెస్‌లో జరుగుతున్న షూటింగ్లో మెయిన్ కాస్ట్ పాల్గొంటున్నారు. హీరో, అతని గర్ల్‌ఫ్రెండ్, అతని ఎక్స్లెంట్ వైఫ్.. ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో వెంకటేశ్ జోడీగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. రీసెంట్గా విడుదల చేసిన మేకింగ్ వీడియో వర్కింగ్ ఎట్మాస్పియర్ని చూపించింది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా ఇది’ అని తెలిపారు. ఉపేంద్ర లిమాయే, రాజేంద్రప్రసాద్, సాయికుమార్ నరేశ్, వీటీ గణేశ్, మురళీధర్‌గౌడ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- anil ravipudi
- f2
- f3
- Venkatesh
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

