నాగచైతన్యను కొత్తగా చూస్తారు
‘సరోజ’, ‘మాంగాత’, ‘మానాడు’ వంటి చిత్రాలతో కోలీవుడ్‌లో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు వెంకట్ ప్రభు. నాగచైతన్య హీరోగా ఆయన రూపొందించిన తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’. కృతి శెట్టి నాయిక. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈ నెల 12న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు దర్శకుడు వెంకట్ ప్రభు.
‘సరోజ’, ‘మాంగాత’, ‘మానాడు’ వంటి చిత్రాలతో కోలీవుడ్‌లో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు వెంకట్ ప్రభు. నాగచైతన్య హీరోగా ఆయన రూపొందించిన తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’. కృతి శెట్టి నాయిక. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈ నెల 12న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు దర్శకుడు వెంకట్ ప్రభు.
కొత్త తరహా హీరోయిజంతో
మలయాళ చిత్రం ‘నాయటు’్ట స్ఫూర్తితో కోవిడ్‌లో టైమ్‌లో ఈ కథ రాసుకున్నాను. శివ అనే కానిస్టేబుల్ కథ ఇది. చిన్న టౌన్లో నివసించే అతను పోలీస్ డిపార్ట్మెంట్లో చేరతాడు. అతనికో కుటుంబం, బాధ్యతలు, ప్రేమ కథ ఉంటాయి. అనుకోకుండా తన స్థాయికి మించిన ఓ సమస్యలో ఇరుక్కుంటాడు. సమాజంలోని ఇద్దరు పెద్ద వ్యక్తులతో అతను పోరాటం చేయాల్సి వస్తుంది. ఆ సమస్యను శివ ఎలా పరిష్కరించుకున్నాడు అనేది ఆసక్తికరంగా తెరకెక్కించాం. శివ అనే పాత్రకు ఎలాంటి ఇమేజ్ లేని హీరో కావాలని అనుకున్నాను. నాగచైతన్య గతంలో కొన్ని కమర్షియల్ సినిమాల్లో నటించాడు. అయితే ఇందులో అతన్ని ఒక సాధారణ మధ్య తరగతి యువకుడిలా చూపిస్తున్నాం. ఈ చిత్రంలోనూ ఫైట్స్, హీరోయిజం ఉంటుంది కానీ రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా తెరకెక్కించాం. నాగార్జున ‘శివ’ సినిమా నాకు బాగా ఇష్టం. ఆ అభిమానంతో ఈ సినిమాలో నాగ చైతన్య పాత్రకు శివ అని పెట్టాను.
శివగా నాగచైతన్య ఆకట్టుకుంటారు
శివ పాత్రలో నాగచైతన్య నటన మెప్పిస్తుంది. సినిమాలోని ప్రతి ట్విస్ట్ ఆయన పాత్ర ద్వారానే ప్రేక్షకులకు తెలుస్తుంది. నా సినిమాల్లో హీరోలు వైవిధ్యంగా ఉంటారు. నాగచైతన్యను కూడా కొత్తగా చూపించాను. ఇంటర్వెల్‌కు ఇరవై నిమిషాల నుంచి కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. తెలుగు, తమిళ ప్రేక్షకులకు నచ్చే థ్రిల్లర్ సినిమా ఇది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుంది. సినిమాలో వాళ్లు ఏ సీన్స్‌కు మ్యూజిక్ చేశారో గుర్తుపట్టేస్తారు. హీరో ఇంట్రడక్షన్ సాంగ్, రెట్రో ైస్టెల్లో చేసిన పాటలు బాగా కుదిరాయి. రెండు భాషల్లో సినిమా విడుదల కోసం సాంకేతికంగా అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా చేయాలని ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

