ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ నటించిన కన్నడ చిత్రం ‘వేద’. హర్ష దర్శకుడు. తెలుగులో ఈ చిత్రాన్ని అదే పేరుతో విడుదల చేస్తున్నారు నిర్మాత వీఆర్ కృష్ణ మండపాటి. ఇటీవల ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘కన్నడలో విడుదలై ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా సూపర్‌హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. తెలుగు ప్రేక్షకులు మెచ్చే కమర్షియల్ యాక్షన్ డ్రామా ఇది’ అన్నారు. అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ తదితరులు నటిస్తున్న చిత్రానికి సంగీతం: అర్జున్ జన్య