Vasavi | సీనియర్ నటి వాసవి కన్నుమూత .. క్యాన్సర్తో పోరాడుతూ విజయనగరంలో తుదిశ్వాస
Vasavi | తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటి వాసవి అలియాస్ పద్మ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె బుధవారం తన స్వస్థలమైన విజయనగరంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
Vasavi | తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటి వాసవి అలియాస్ పద్మ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె బుధవారం తన స్వస్థలమైన విజయనగరంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఆమె మరణవార్తతో సినీ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కరాటే కళ్యాణి తన ఫేస్బుక్ పోస్టులో పద్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. “నిన్ను కాపాడాలని ఎంతో ప్రయత్నించాను. కానీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావు. నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి” అంటూ ఆమె పేర్కొన్నారు. ఈ పోస్టు అనంతరం పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు వాసవికి సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు.
1978లో విజయనగరంలో జన్మించిన వాసవి, జయ వాహిని పేరుతో టెలివిజన్ మరియు సినీ రంగాల్లో మంచి గుర్తింపు సంపాదించారు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన ఆమె అనేక తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. సినిమాలతో పాటు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆమె నటన ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. 2019లో విడుదలైన ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ చిత్రంలో వీకే నరేష్ సరసన నటించిన ఆమె, చివరిసారిగా ‘బహిర్భూమి’ సినిమాలో కనిపించారు.
గత కొన్ని సంవత్సరాలుగా రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న వాసవి ఆరోగ్య కారణాల వల్ల నటనకు దూరమయ్యారు. ఆమె పరిస్థితి విషమించడంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లాలని సూచించగా, కుటుంబ సభ్యులు విజయనగరానికి తరలించారు. అక్కడే ఆమె చివరి శ్వాస విడిచారు. తెరపై అనేక పాత్రలతో అలరించిన ఈ నటి ఇక లేరనే వార్త అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఆమె మృతికి పలువురు నివాళులు అర్పిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

