VT12 | వరుణ్ తేజ్-ప్రవీణ్ సత్తారు మూవీ నుండి బిగ్ అప్డేట్..!
గతేడాది వరణ్ తేజ్‌కు అస్సలు కలిసి రాలేదు. ఎంతో కష్టపడి చేసిన 'గని' డిజాస్టర్‌గా మిగిలింది. ఆ గాయం మరిచిలోపే 'ఎఫ్-3'తో మరో పరాజయం ఎదురైంది. ప్రస్తుతం వరుణ్‌తేజ్ ఆశలన్ని ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపైనే ఉన్నాయి.
VT12 Movie | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫలితంతో సంబంధంలేకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ బిగినింగ్ నుండి విభిన్న తరహా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. అయితే గతేడాది వరణ్‌కు అస్సలు కలిసి రాలేదు. ఎంతో కష్టపడి చేసిన ‘గని’ డిజాస్టర్‌గా మిగిలింది. ఆ గాయం మరిచిలోపే ‘ఎఫ్-3’తో మరో పరాజయం ఎదురైంది. ప్రస్తుతం వరుణ్‌తేజ్ ఆశలన్ని ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపైనే ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోకు ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన వచ్చింది.
తాజాగా చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ను ప్రకటించింది. ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను జనవరి 19న విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. సహా నిర్మాతగా నాగబాబు వ్యవహరిస్తున్నాడు. మిక్కీ జే మెయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఇక దీనితో పాటు వరుణ్ ఇటీవలే తన 13వ సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.
Locked, Loaded & Ready to Fire 🔥
Unveiling Mega Prince @IAmVarunTej’s #VT12 Title & First Look on JAN 19th❤🔥
Stay Tuned💥💥
A @PraveenSattaru Film @MickeyJMeyer @BvsnP @SVCCofficial pic.twitter.com/IlA8fxIDay
— SVCC (@SVCCofficial) January 17, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

