VT13 | వరుణ్ తేజ్ బ్యాక్ టు వర్క్.. VT13 స్టైలిష్ అవతార్ అదిరింది
VT13 | టాలీవుడ్ యువ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ VT13. VT13లో మాజీ మిస్ యూనివర్స్ మానుషి ఛిల్లార్ (Manushi Chhillar) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. వరుణ్‌తేజ్ ఈ సినిమా షూటింగ్‌తో మళ్లీ బిజీగా అయ్యాడు.
VT13 | టాలీవుడ్ యువ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వీటిలో ఒకటి VT13. వార్ డ్రామా నేపథ్యంలో పాన్ ఇండియా కథాంశంతో వస్తోన్న ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్‌గా నటిస్తున్నాడు. VT13లో మాజీ మిస్ యూనివర్స్ మానుషి ఛిల్లార్ (Manushi Chhillar) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
కొన్ని రోజులుగా నిశ్చితార్థం, ఇతర పనులతో బిజీగా ఉన్న వరుణ్‌తేజ్ ఈ సినిమా షూటింగ్‌తో మళ్లీ బిజీ అయ్యాడు. వరుణ్‌తేజ్ పైలట్ పాత్ర కోసం షార్ట్ హెయిర్ లుక్‌లో ఐఏఎఫ్ ఆఫీసర్‌గా స్టైలిష్ అవతార్‌లోకి మారిపోయిన స్టిల్స్ ను మేకర్స్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడీ స్టిల్స్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. యదార్థ సంఘటనల ఆధారంగా వస్తోన్న VT13 చిత్రాన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (భారత వైమానిక దళం)కు నివాళులర్పిస్తూ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మానుషి ఛిల్లార్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది.
తెలుగు, హిందీ బై లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తున్న VT13కు సంబంధించి మేకర్స్ ఇప్పటికే పలు కీ షెడ్యూల్స్‌ను పూర్తి చేశారు. సోనీ పిక్చర్స్-రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్ద, నందకుమార్ అబ్బినేని తెరకెక్కిస్తున్నారు. వరుణ్ తేజ్ మరోవైపు VT 12గా తెరకెక్కుతున్న గాండీవధారి అర్జున సినిమాలో కూడా నటిస్తున్నాడు.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన గాండివధారి అర్జున మోషన్ పోస్టర్ గ్లింప్స్ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. యాక్షన్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
The highly anticipated #VT13 shoot is charging ahead at lightning speed in Annapurna 7 Acres,HYD💥
A Major breathtaking action sequence is being filmed currently on an unprecedented scale🔥
TITLE LOCKED & GRAND LAUNCH SOON❤️🔥@IAmVarunTej @ManushiChhillar @shaktipshada pic.twitter.com/2BQtVzp7aE
— Vamsi Kaka (@vamsikaka) June 26, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

