గెలిస్తేనే చరిత్రలో ఉంటాం!

యువహీరో వరుణ్‌తేజ్ బాక్సింగ్ బరిలో పోరాటానికి సై అంటున్నాడు. పదునైన పంచ్‌లతో ప్రత్యర్థులకు తన పవరేమిటో చూపిస్తానని చెబుతున్నాడు. బాక్సింగ్ కథాంశం నేపథ్యంలో ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మాతలు. డిసెంబర్ 24న ప్రేక్షకులముందుకురానుంది. సోమవారం టీజర్‌ను విడుదల చేశారు. దీనికి అగ్ర కథానాయకుడు రామ్‌చరణ్ వాయిస్ ఓవర్ అందించారు. ‘ప్రతి ఒక్కడి కథలో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. కోరికలుంటాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడికి ఛాంపియన్ అయిపోవాలన్న ఆశ ఉంటుంది. కానీ విజేతగా నిలిచేది ఒక్కడే. ఆట ఆడినా ఓడినా రికార్డ్స్‌లో ఉంటాం. కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటాం’ అంటూ వాయిస్ ఓవర్లో రామ్‌చరణ్ చెప్పిన సంభాషణలు స్ఫూర్తివంతంగా అనిపించాయి. బాక్సింగ్ బరిలో రొమాంచితమైన పోరాట ఘట్టాలు, విజయం కోసం కథానాయకుడి ప్రయత్నాల్ని ఆవిష్కరిస్తూ టీజర్ ఆసక్తికరంగా సాగింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించే చిత్రమిది. తన పాత్రలో పరిపూర్ణత కోసం వరుణ్‌తేజ్ విదేశాలకు వెళ్లి బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు’ అన్నారు. సయీ మంజ్రేకర్, ఉపేంద్ర, సునీల్‌శెట్టి, ననీన్‌చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్, సంగీతం: తమన్, నిర్మాణ సంస్థలు: రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ, సమర్పణ: అల్లు అరవింద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

