Varun Tej – Lavanya | దసరా పండుగ సందర్భంగా కుమారుడి పేరు రివీల్ చేసిన వరుణ్ తేజ్
Varun Tej - Lavanya | మెగా హీరో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి దంపతులు తల్లిదండ్రులు అయిన విషయం తెఇసిందే.. సెప్టెంబర్ 10 ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్బో ఆసుపత్రిలో లావణ్య త్రిపాఠి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.
Varun Tej – Lavanya | మెగా హీరో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి దంపతులు తల్లిదండ్రులు అయిన విషయం తెఇసిందే.. సెప్టెంబర్ 10 ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్బో ఆసుపత్రిలో లావణ్య త్రిపాఠి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. కొడుకు పుట్టిన శుభవార్తతో మెగా ఫ్యామిలీ అంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ షూటింగ్ మద్యలోనే నేరుగా ఆసుపత్రికి వెళ్లి వరుణ్, లావణ్యలను పలకరించి శుభాకాంక్షలు తెలిపారు.ఇక చిన్నారికి బారసాల పూర్తైనట్టు తెలుస్తుండగా, ఈ రోజు దసరా పండుగ సందర్భంగా కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ కుమారుడి పేరు రివీల్ చేశారు.ఆంజనేయ స్వామి దయతో పుట్టిన బాబుకి వాయువ్ తేజ్ కొణిదెల అని నామకరణం చేశాం. మీ అందరి దీవెనెలు కావాలని వరుణ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ఇక వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ప్రేమకథ అందరికీ తెలిసిన విషయమే. 2017లో ‘మిస్టర్’ సినిమా ద్వారా కలిసిన ఈ జంటకు, ఆతరువాత ‘అంతరిక్షం 9000 KMPH’ చిత్రంలో కలిసి నటించే అవకాశమొచ్చింది. అప్పటి నుండి ఏర్పడ్డ సాన్నిహిత్యం ప్రేమగా మారి, చివరకు 2023 జూన్‌లో ఎంగేజ్మెంట్, అదే ఏడాది నవంబర్ 1న ఇటలీలోని టస్కానీలో వైభవంగా జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారు. పెళ్లైన ఏడాదిలోనే “తల్లిదండ్రులం కాబోతున్నాం” అనే శుభవార్తను వరుణ్ తేజ్ ఈ మే నెలలో సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ, “జీవితంలో అత్యంత అందమైన పాత్ర పోషించబోతున్నాను” అన్నారు. ఇప్పుడు ఆ గుడ్ న్యూస్ రియాలిటీగా మారింది.
మెగా వారసుడి రాకతో అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరింది. సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా వరుణ్ – లావణ్య దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెట్టారు. #MegaBaby, #VarunLavBaby అనే హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఇక సినిమాల విషయానికి వస్తే వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కొరియన్ కనకరాజ్’ అనే హారర్ కామెడీ మూవీలో నటిస్తున్నాడు. ఇక లావణ్య త్రిపాఠి అధర్వ మురళితో కలిసి నటించిన ‘టన్నెల్’ మూవీ ఈ సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల అయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

