Varun Tej | మెగా ప్రిన్స్‌ను వెంటాడుతున్న వరుస ఫ్లాపులు.. వరుణ్ తేజ్ కష్టం బూడిదలో వేసిన పన్నీరవుతుంది..!
Varun Tej | మెగా కాంపౌడ్ నుంచి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ కాస్త డిఫరెంట్. ఒడ్డు బొడువు చక్కగా ఉండి చూడ్డానికి హాలీవుడ్ హీరో రేంజ్ కటౌట్‌తో కనిపిస్తున్నాడు. సరైన కథ, దర్శకుడు పడాలే కానీ.. వరుణ్ తేజ్ కెరీర్ గ్రాఫ్ ఉన్నఫలంగా పది రేట్లు ఎక్కేస్తుంది.
Varun Tej | మెగా కాంపౌడ్ నుంచి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ కాస్త డిఫరెంట్. ఒడ్డు బొడువు చక్కగా ఉండి చూడ్డానికి హాలీవుడ్ హీరో రేంజ్ కటౌట్‌తో కనిపిస్తున్నాడు. సరైన కథ, దర్శకుడు పడాలే కానీ.. వరుణ్ తేజ్ కెరీర్ గ్రాఫ్ ఉన్నఫలంగా పది రేట్లు ఎక్కేస్తుంది. ఇక వరుణ్ కెరీర్ బిగెనింగ్ నుంచే ఎక్కువగా మాస్, యాక్షన్ కథల జోలికి వెళ్లకుండా ప్రేక్షకులకు సరికొత్త థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విధంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాలు చేస్తుంటాడు. వరుణ్ కెరీర్లో ఒకటి, రెండు సినిమాలు తప్పితే మిగితావన్నీ అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్ సినిమాలే. అలాంటి నటుడిను వరుస ఫ్లాప్‌లు వెంటబడుతున్నాయి.
రెండు ఏళ్లు ఒళ్లు హూనం చేసుకుని ఎంతో కష్టపడి చేసిన గని.. పబ్లిసిటీ ఖర్చులను కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. ఈ సినిమా గాయం మర్చిపోకముందే ఎఫ్-3 రూపంలో మరో బిగ్ షాక్ తగిలింది. వెంకీమామతో కలిసి చేసిన ఈ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయిపోయింది. ఇక ఇటీవలే రిలీజైన గాండీవధారి అర్జున సైతం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వరుణ్ తేజ్ స్టైలిష్ మేకోవర్, కథ రెండూ బాగానే ఉన్నా.. కథనం సరిగ్గా లేకపోవడం.. చాలా వరకు సీన్స్ బోర్ కొట్టించడంతో తొలి రోజే ఫుల్ నెగెటివిటీ వచ్చేస్తుంది. దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా పట్టుమని పది కోట్ల కలెక్షన్లు కూడా సాధించలేకపోయింది.
ఇలా వరుణ్ కష్టం అంతా బూడిదలో వేసిన పన్నీరులా అయిపోయింది. వరుణ్ ఎంత కష్టపడుతున్నా దానికి తగ్గ ఫలితం మాత్రం రావడం లేదు. యావరేజ్‌గా ఉన్నా ఒకే కానీ.. మరీ డిజాస్టర్ మాటలు వినిపంచడంతో మెగా అభిమానులు నిరాశ చెందుతున్నారు. టీజర్, ట్రైలర్లు గట్రా గాండీవధారి అర్జనపై మంచి హైపే క్రియేట్ చేసింది. అయితే ఆ హైప్ జనాలను థియేటర్ల వరకు కూడా రాలేనివ్వలేకపోయింది. గనీకి కనీసం డీసెంట్ కలెక్షన్లైనా వచ్చాయి.. కానీ అర్జునకు మాత్రం పోస్టర్ ఖర్చులను కూడా తీసుకురాలేకపోయింది.
ఇలా నెల రోజుల గ్యాప్‌లోనే మెగా కాంపౌడ్ నుంచి వచ్చిన బ్రో, భోళా శంకర్, అర్జున సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అవడంతో మెగా అభిమానుల బాధ అంతా ఇంతా కాదు. ఇక ప్రస్తుతం వరుణ్ ఆశలన్నీ డిసెంబర్లో రిలీజైయ్యే ఆపరేషన్ వాలెంటైన్ పైనే ఉన్నాయి. సూర్య ప్రతాప్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏయిర్ ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది. మనూషి చిల్లర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతుంది. మరీ ఈ సినిమానైనా మెగా ప్రిన్స్‌కు కలిసి వస్తుందో లేదో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

