‘మిడిల్‌క్లాస్ మెలొడీస్’, ‘చూసీ చూడంగానే’ వంటి చిత్రాలతో యువ హీరోలకు మంచి జోడీగా మారింది వర్ష బొల్లమ్మ. ఆమె రాజ్‌తరుణ్ సరసన నటిస్తున్న కొత్త సినిమా ‘స్టాండప్ రాహుల్’. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. శాంటోమోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈనెల 18న
విడుదలవుతున్నది. ఈ సందర్భంగా వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ…‘లాక్డౌన్ తర్వాత మనమంతా నవ్వుల కోసం వేచి చూస్తున్నాం. ఆ నవ్వులను అందించే చిత్రమిది. నేను వ్యక్తిగతంగా థియేటర్లో ఇలాంటి చిత్రాన్ని చూసేందుకే ఇష్టపడతాను. రొమాంటిక్ ప్రేమ కథా చిత్రమిది. నేను శ్రేయారావ్ అనే పాత్రలో నటించాను. తనొక స్టాండప్ కమెడియన్. నిజజీవితంలో కూడా బాగా మాట్లాడుతూ ఉంటా కాబట్టి ఈ పాత్రలో నటించడం సులువైంది. సరదాగా ఉండే పాత్ర ఇది. నా కల కోసమే కాదు నేను ప్రేమించిన అబ్బాయి కల కోసం కూడా నిలబడే క్యారెక్టర్లో నటించాను. హీరో రాజ్‌తరుణ్ కూడా నాలా అల్లరి వాడే. సినిమా కోసం వర్క్ షాప్స్ చేశాం. నా పాత్రకు న్యాయం చేసేందుకే తెలుగు నేర్చుకున్నా. ఎంపికగా సినిమాలు చేస్తున్నా’ అని చెప్పింది.